ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఈనెల 27న నిర్వహించే కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కొన్యాల బాల్‌రెడ్డి కోరారు.
సోమవారం సెక్రటేరియట్‌లో సీఎంను కలిశారు. అనంతరం కోదండ రామస్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికను సీఎం ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి కల్యాణానికి తప్పక వస్తానని సీఎం చెప్పినట్లు బాల్ రెడ్డి తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామిని సైతం కలిసి కల్యాణానికి ఆహ్వానించినట్లుగా చెప్పారు.
